గోరఖ్నాథ్ ఆలయంలో కన్యాపూజ: బాలికల పాదాలు కడిగి పూజలు చేసిన సీఎం యోగి

రిపోర్టర్: సతీష్ స్థలం: గోరఖ్‌పూర్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ లోని ప్రసిద్ధ గోరఖ్నాథ్ ఆలయంలో సంప్రదాయబద్ధంగా కన్యాపూజ నిర్వహించినట్లు తెలిపారు. మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తొమ్మిది మంది చిన్నారి బాలికలను దుర్గాదేవి స్వరూపాలుగా భావిస్తూ స్వయంగా వారి పాదాలు కడిగి, నమస్కరించి పూజలు చేశారు. అనంతరం చిన్నారులకు స్వయంగా మహాప్రసాదం వడ్డించి కానుకలు అందజేశారు. స్త్రీ శక్తికి గౌరవం ఇవ్వడమే సమాజ పురోగతికి మూలస్తంభమని ఆయన పేర్కొన్నారు.