ఓటర్లకు భారీ ఊరట: ఫారం 6 అక్కర్లేదంటూ ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సడలింపులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్ లో ఈ తాజా నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులు ఇకపై ఫారం ఆరు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం ఎన్యూమరేషన్ పత్రం ఇస్తే సరిపోతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.