కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ నాయకులు
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
వైసీపీ పాలనలో ప్రభుత్వ భూముల నుంచి కసుమూరు దర్గా హుండీల వరకూ సర్వస్వం దోచుకున్న ఘనత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిదేనని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మీడియాతో మాట్లాడిన వారు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. సోమిరెడ్డిపై విమర్శలు చేసే నైతిక అర్హత కాకాణికి లేదని, ఆయన అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.