అమెరికా పౌరులకు ట్రంప్ భారీ ఆఫర్.. ఐదు వేల డాలర్లు!
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే ప్రతి వయోజన అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్లు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. 'ట్రంప్ డివిడెండ్' పేరుతో టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఈ ప్రతిపాదన చేశారు. అయితే ఇది ఓటర్లను ఆకట్టుకునే లంచం అంటూ విమర్శకులు మండిపడుతుండగా, దీనివల్ల తీవ్ర ద్రవ్యోల్బణం వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.