రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల సమరశీల పోరు
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో సీపీఐ పోటీకి సిద్ధం కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు పిలుపునిచ్చారు. నగరిలో నిర్వహించిన పట్టణ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని మురికివాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజా సంఘాలతో కలిసి ప్రత్యామ్నాయ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.