ఉద్యోగులపై బలవంతం లేదు: ఉదయం మూడు గంటలకే పనిచేసే భారతీయ సీఈవో

రిపోర్టర్: నరేష్ స్థలం: San Francisco

ఉద్యోగులపై ఎటువంటి బలవంతం లేదని, పని గంటల కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని భారతీయ సంతతికి చెందిన అమెరికా కంపెనీ సీఈవో హార్దిక్ జగడ వెల్లడించారు. తాను ఉదయం మూడు గంటలకే నిద్రలేచి రోజువారీ విధులు ప్రారంభిస్తానని తెలిపారు. అయితే తన ఉద్యోగులెవరు కూడా అదే విధానాన్ని పాటించాలని తాను కోరుకోనని, ఫలితాలకే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు.