అమెరికాలో అఫ్గాన్ వలసదారుల బహిష్కరణ: తాలిబన్ల పాలనకు పంపిస్తే ముప్పేనంటూ ఆందోళన
రిపోర్టర్: సురేష్
స్థలం: Washington
అమెరికాలో అదుపులో ఉన్న డజన్ల కొద్దీ అఫ్గాన్ వలసదారులను వచ్చే వారం స్వదేశానికి బహిష్కరించే అవకాశం ఉందని లాయర్లు మరియు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. అమెరికా సైన్యానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. వీరిని వెనక్ కి పంపిస్తే తాలిబన్ల చేతిలో తీవ్ర హింసను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాపోయారు.