అర్నబ్ తుపాను బీభత్సం: భారీగా రైలు సర్వీసులు రద్దు చేసిన రైల్వే శాఖ
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
అర్నబ్ తుపాను ప్రభావంతో రైలు ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 28 తేదీల్లో మొత్తం 53 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే రైళ్లతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రణాళికలను సరిచూసుకోవాలని సూచించారు.