షాకింగ్ ఓటమి: బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఛాంపియన్స్ పరాజయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Sharjah
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ చేతిలో ఇండియా ఛాంపియన్స్ జట్టు మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైందని క్రీడా వర్గాలు తెలిపాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్లో పరాజయం చవిచూడటంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 138 పరుగులకే పరిమితమైంది.