అహ్మదాబాద్‌లో భారీ అక్రమ మద్యం దందా గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అహ్మదాబాద్
డెలివరీ పోర్టల్స్ మరియు సెకండ్ హ్యాండ్ దుస్తుల మాటున అక్రమంగా మద్యం తరలిస్తున్న భారీ రాకెట్‌ను అహ్మదాబాద్ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్ హౌసింగ్ బోర్డ్ కాంప్లెక్స్‌లోని ఓ ఫ్లాట్‌పై దాడి చేసి వేలాది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ నుండి కార్గో బాక్సులలో తరలిస్తున్న ఈ అక్రమ రవాణాలో నిషిత్ షా, జయ్ పవార్, కిషన్ షా అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.