వైసీపీ నేతల తప్పుడు ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర గర్జన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోటబొమ్మాళి

ఎన్నికల్లో హైజాక్ జరిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలపై తక్షణమే స్పష్టమైన ఆధారాలు చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని స్పష్టం చేశారు. గతంలో ఈవీఎంలను తప్పుపట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని కూడా విమర్శించడం సరికాదని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.