కొలనుపాక పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నిపుణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జెడ్పీహెచ్ఎస్లో సైబర్ భద్రత, ఆన్లైన్ మోసాలు, విద్యార్థుల నాయకత్వ లక్షణాలు, పాలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని వక్తలు ప్రోత్సహించారు.