కూటమి సర్కార్ అభివృద్ధి ప్రకటనల మోసమంటూ కాంగ్రెస్ నాయకుడు మువ్వల విమర్శ

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, గడిచిన రెండున్నర ఏళ్లలో పట్టణ అభివృద్ధికి చేసింది శూన్యమని ఆయన ధ్వజమెత్తారు.