విశాఖలో వైభవంగా శ్రీ బంగారమ్మ, కుంచాలమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో శ్రీ బంగారమ్మ, కుంచాలమ్మ అమ్మవార్ల నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గ్రామస్థులు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేపట్టారు. రాత్రికి అమ్మవారి చరిత్రను తెలిపే బుర్రకథ, సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.