బైక్ ప్రియులకు గుడ్ న్యూస్: హీరో ఎక్స్‌పల్స్ 421 గ్లోబల్ ఆవిష్కరణ
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తన సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఎక్స్‌పల్స్ 421 బైక్‌ను ఇటలీలో జరగనున్న ఈఐసీఎంఏ ప్రదర్శనలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్లోబల్ ఆవిష్కరణకు ముందే కంపెనీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా టీజర్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని హీరో మోటోకార్ప్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ శక్తివంతమైన బైక్ సుమారు 420 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ తో వస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.