వినాయక నిమజ్జనంలో భద్రతా చర్యలపై పోలీసుల అవగాహన
రిపోర్టర్: రమేష్
స్థలం: కౌలూరు, ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రశాంతమైన ఊరేగింపులు, డీజే నిబంధనలు, విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ మోసాలపై సే నో టూ ఓటీపీ షేరింగ్, మాదకద్రవ్యాలపై సే నో టూ డ్రగ్స్ ప్లకార్డులతో అవగాహన కల్పించి, మోసం జరిగితే 1930కి ఫిర్యాదు చేయాలని కోరారు.