నారాయణవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నారాయణవరం
నారాయణవరం ఎంఆర్సీ వేదికగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ కోనేటి సుమన్, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన చెంగల్ రాజు, మమత, సోమశేఖర్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
అనంతరం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, ఎంఈవోలు కోదండ నాయుడు, చంద్రశేఖర్ శెట్టి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.