తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉల్లి ధరలు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.80కి చేరాయి. సరఫరా తగ్గిపోవడంతో రాబోయే రోజుల్లో వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. సామాన్యుల భారాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా రూ.32కే కిలో ఉల్లిని అందించేందుకు చర్యలు చేపట్టింది. ధరలు సాధారణ స్థితికి రావడానికి రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.