భక్తిభావంతో మతసామరస్యాన్ని చాటుతూ వినాయక చవితి వేడుకలు జరపాలన్న ఎస్పీ
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ తుషార్ డూడి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జ గణపయ్య కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి సుఖసంతోషాలు, విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు. చవితి వేడుకలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, మతసామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలని, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా పూర్తి చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 112 లేదా వాట్సాప్ నంబర్ 9440900005 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు స్పష్టం చేశారు.