ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఎల్ నినో వల్ల ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రెండేళ్లు ఖరీఫ్ ప్రీమియం ఎగ్గొట్టారని, రబీకి ఒక్క ఏడాది కూడా ఇన్సూరెన్స్ కట్టలేదని విమర్శించారు.