రాజమౌళి, మహేష్ బాబుకు ఎన్నికల సంఘం నోటీసులు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నటుడు మహేష్ బాబు, వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు వీఐపీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పేర్లలో తేడాలు, చిరునామా సరిపోకపోవడం వంటి కారణాలతో ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సెలబ్రిటీలకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.