ప్రయాణికుడిని వదిలేసి ఒంటరిగా వెళ్లిపోయిన రాపిడో బైక్ డ్రైవర్
రిపోర్టర్: మహేష్
స్థలం: బెంగళూరు
బెంగళూరులో ఓ రాపిడో రైడ్ సమయంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుందని సోషల్ మీడియాలో యువతి వెల్లడించారు. తాను పిన్ నంబర్ చెప్పి హెల్మెట్ ధరించే లోపే డ్రైవర్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లిపోయారని బాధితురాలు తెలిపారు. ప్రయాణికుడు లేకుండానే డ్రైవర్ పది నిమిషాల పాటు ప్రయాణం కొనసాగించడంతో ఈ ఉదంతం నెట్టింట వైరల్గా మారింది.