ఢిల్లీలో ఘనంగా ఉపి పేజావర స్వామీజీ పాదపూజ

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో ఉపి శ్రీ పేజావర అథోక్షజ మఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ మహాస్వామీజీ పాదపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. నూతన దిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న కేంద్రమంత్రి అధికారిక నివాసంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగింది. ఈ పవిత్ర వేడుకలో పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామీజీ దివ్య ఆశీస్సులు అందుకున్నారు.