పోన్కల్లో కోతుల బెడద తీవ్రతతో వణికిపోతున్న స్థానిక ప్రజలు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని పోన్కల్ లో కోతుల బెడద పెరగడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా కోతులు నలుగురిని కరవడంతో వారు ఆస్పత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ధర్మారం చౌరస్తా, అంగడి బజార్ ప్రాంతాలలో దుకాణాలు ఎక్కువగా ఉండటంతో కోతులు గుంపులు గుంపులుగా వచ్చి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.