వినాయక ఉత్సవాల్లో డీజేల వినియోగిస్తే వాహనాల సీజ్ తో పాటు కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరిక
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
వినాయక మండపాల వద్ద, ఊరేగింపుల్లో డీజేలు వాడితే వాహనాలు సీజ్ చేసి కేసులు పెడతామని నేలకొండపల్లి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు పోలీస్ స్టేషన్ లో డీజే యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ వారందరినీ ముందస్తుగా బైండోవర్ చేశారు. నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు శబ్దకాలుష్య నివారణ చర్యలు పక్కాగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.