సీఎం చంద్రబాబును కలిసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లి నివాసంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ శనివారం కలిశారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా చేపడుతున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను సీఎంకు వివరించారు. మరోవైపు విజయవాడలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా డూండి గణేశ్ సేవా సమితి ప్రతినిధులు చంద్రబాబును ఆహ్వానించారు.