'తాతా మధు బాటలో పీఏలు.. పోలీసులపై దౌర్జన్యం': బల్మూరి వెంకట్ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తాతా మధు పీఏల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతా మధు బాటలోనే వారి పీఏలు కూడా పోలీసులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, శాంతి భద్రతలు కాపాడే పోలీసులపై, మహిళా పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి అసభ్య పదజాలం ఉపయోగించలేదని గుర్తుచేశారు. ఈ చర్యలు ఖండనీయమని స్పష్టం చేశారు.