వెస్టిండీస్‌తో మూడో వన్డేకు దూరమైన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ
రిపోర్టర్: నరేష్
స్థలం: చండీగఢ్
భారత పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తొడ కండరాల గాయం కారణంగా వెస్టిండీస్‌తో జరగనున్న మూడో వన్డేకు దూరమైనట్లు భారత్ బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ వెల్లడించారు. గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఐదు ఓవర్లు మాత్రమే వేసిన ఆయన మైదానాన్ని వీడారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్న ప్రసిద్ధ్ కృష్ణ తదుపరి చికిత్స తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో చివరి వన్డే తుది జట్టులో మహ్మద్ సిరాజ్ లేదా నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.