ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన సునీల్ కుమార్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా క్రీడల రెజ్లింగ్ విభాగంలో భారత్ తొలి పతకం సాధించినట్లు అధికారులు తెలిపారు. పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఫిలిప్పీన్స్కు చెందిన కల్లమ్ జాన్సన్పై 9-0 తేడాతో అద్భుత విజయం సాధించి ఈ ఘనత సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా సునీల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. సెమీఫైనల్స్లో జపాన్ రెజ్లర్ చేతిలో ఓడిన సునీల్, కాంస్య పతక పోరులో గెలిచి దేశం కీర్తిని ఇనుమడింపజేశారు.