కాణిపాకంలో వైభవంగా జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం

రిపోర్టర్: వెంకట్ స్థలం: కాణిపాకం

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు. సిద్ధి, బుద్ధి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి యాగశాలలో పూజల అనంతరం పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఆలయ ఛైర్మన్‌ వి.మణినాయుడు, ఈవో పెంచలకిశోర్‌లతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.