నెల్లూరు జిల్లాలో అద్భుతం: శివలింగాన్ని దర్శించుకున్న మూడు నాగుపాములు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు వద్ద గల విశ్వనాథ స్వామి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున గర్భగుడిలోకి ప్రవేశించిన మూడు పెద్ద నాగుపాములు శివలింగం ముందు పడగ విప్పి పదిహేను నిమిషాల పాటు దర్శించుకున్నాయని ఆలయ పూజారులు తెలిపారు. ఎలాంటి హాని తలపెట్టకుండా అవి నెమ్మదిగా వెళ్లిపోయాయని భక్తులు పేర్కొన్నారు. ఈ అద్భుత దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.