పాలనా నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్న ఆత్మకూరు మండల రహదారులు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిలను హై లెవెల్ బ్రిడ్జిలుగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబరు 20, 21 తేదీల్లో తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నాడు ప్రత్యేక వాల్ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, మండల కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.