హఫీజ్‌పేట్‌లో మహిళను ఈడ్చుకెళ్లిన పోలీస్ అమానుష ఘటన

రిపోర్టర్: అశోక్ స్థలం: హఫీజ్‌పేట్

తెలంగాణలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో తీవ్ర అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ - హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరల్ వీడియోపై ప్రజలు భగ్గుమంటుండగా, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.