దీపావళి పండుగ తేదీలపై క్లారిటీ: లక్ష్మీ పూజ శుభ ముహూర్తం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
ఈ ఏడాది దీపావళి పండుగ తేదీలపై నెలకొన్న గందరగోళానికి పండితులు తెరదించారని పురోహితులు తెలిపారు. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య తిథులు ఒకే రోజు రావడంతో నవంబర్ 8 ఆదివారం రోజే రెండు పండుగలు జరుపుకోవాలని స్పష్టం చేశారు. సాయంత్రం 5:54 గంటల నుంచి రాత్రి 7:50 గంటల వరకు లక్ష్మీ పూజకు అత్యంత శుభ ముహూర్తం ఉందని వెల్లడించారు. ఈ అరుదైన సందర్భంలో కుటుంబ సభ్యులంతా కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.