యాదాద్రి జిల్లాలో దారుణం: పీహెచ్సీలో వైద్యురాలపై రోగి దాడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Yadadri Bhuvanagiri

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ శ్వేతపై దుద్యాల వెంకట తిరుపతి అనే వ్యక్తి దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. కాలి గాయానికి చికిత్స పొందిన అనంతరం అతడు వైద్యురాలితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని కొట్టడమే కాకుండా కంప్యూటర్ను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మానసిక పరిస్థితిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.