కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు వివాదం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు భౌగోళిక స్వరూపంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదని నమస్తే తెలంగాణ పేర్కొన్నది. సోమవారం జరిగిన ప్రెస్మీట్లో పంప్‌హౌస్‌లు, బరాజ్‌ల అనుసంధానంపై ఆయన మాట్లాడిన తీరు నవ్వులపాలైందని వెల్లడించింది. మేడిగడ్డ నుంచి కన్నెపల్లికి నీళ్లు ఎత్తాలంటూ ఆయన తప్పుడు ప్రకటనలు చేశారని, ప్రాజెక్టు నమూనాను తలకిందులు చేసి ప్రజలను అయోమయానికి గురిచేశారని ఆ కథనంలో వివరించారు.