ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ కొలువు సాధించిన మహిళ

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

సంవత్సరాలు కష్టపడి సాధించిన ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగానికి ఒక మహిళ రాజీనామా చేసి ప్రైవేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆడిట్ కారణంగా ప్రాణ స్నేహితురాలి పెళ్లికి కూడా వెళ్లలేకపోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, ఎలాంటి ముందస్తు ఉద్యోగ భద్రత లేకుండానే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సంతోషంగా ఉన్నానని తెలిపారు.