ఓటు హక్కు రక్షణ పోరాటమే మరో స్వాతంత్ర్య ఉద్యమం అంటూ రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఢిల్లీ
దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమం లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసీఐని అడ్డం పెట్టుకుని దళిత, మైనారిటీల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సైమన్ గో బ్యాక్ స్ఫూర్తితో జ్ఞానేశ్ గో బ్యాక్ నినాదంతో రాహుల్ గాంధీ నేతృత్వంలో తీవ్ర పోరాటం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.