వనమా జన్మదినం వేళ పువ్వాడ అజయ్ ఆత్మీయ భరోసా
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకల సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వనమా తనకు తండ్రితో సమానమని కొనియాడుతూ కొత్తగూడెం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని వనమాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.