గుంటూరులో శరవేగంగా శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: గుంటూరు

గుంటూరు ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శంకర్‌ విలాస్‌ నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చొరవతో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నాలుగు వరుసలతో ఈ ఆర్వోబీ రూపుదిద్దుకుంటోంది. మొత్తం 22 పిల్లర్లలో ఇప్పటికే మెజారిటీ పనులు పూర్తయ్యాయని, వచ్చే మార్చి నాటికి రోడ్లు, డ్రెయిన్లతో సహా మొత్తం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.