విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నిర్ణయంతో నిరుపేదల సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో సుమారు ఇరవై నాలుగు వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల పరిధిలోని అర్హులైన పేదల నివాస స్థలాలను క్రమబద్ధీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కుటుంబానికి నలభై లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.