హైదరాబాద్లో భారీ వర్షాల అలర్ట్: నేడు సాయంత్రం నుంచి కురిసే ఛాన్స్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేడు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.