సీఎం రేవంత్ నివాస ముట్టడికి యత్నించిన తెలంగాణ ఉద్యమకారుల అరెస్ట్

రిపోర్టర్: User స్థలం: బెల్లంపల్లి

సీఎం రేవంత్ రెడ్డి నివాస ముట్టడికి యత్నించిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని నాయకులు మండిపడ్డారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులతో పాటు పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది.