వైద్య విద్యార్థులకు అమెరికా వర్సిటీ పర్యటన: సీఎం సుఖు కీలక ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లోని వైద్య కళాశాలల విద్యార్థులకు అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించే సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రకటించారు. సోమవారం ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులతో పాటు వైద్య అధ్యాపకులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక శిక్షణ, నూతన బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.