గానంతో అలరించిన ప్రముఖ సినీ గాయని హారిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

వినాయక చతుర్థి సందర్భంగా విజయనగరం విచ్చేసిన ప్రముఖ సినీ గాయని హారిక ప్రసాదిని స్థానిక వేణుగోపాల్ స్వామి గుడి బృందావన అపార్ట్మెంట్ లో తన గానముతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. మన ఊరు కావటం మన గర్వకారణం అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రమోద్ కుమార్ పట్నాయక్ తో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఆమె భక్తి పాటలతో పాటు హుషారైన పాటలు పాడి అందరినీ అలరించగా స్థానికులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.