జగిత్యాల పట్టణ ఏఎస్ఐ అజీజుద్దీన్కు పోలీసు శాఖ ఘన సన్మానం

రిపోర్టర్: గోపి స్థలం: జగిత్యాల

పోలీస్ శాఖలో ముప్పై ఏడేళ్లుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ అజీజుద్దీన్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించినట్లు SP JAGTIAL వెల్లడించారు. సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖకు ఆయన అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రశాంతమైన భవిష్యత్ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించినట్లు SP JAGTIAL పేర్కొన్నారు.