స్పీకర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేత కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌కు జరిగిన అవమానంపై సభలో భావోద్వేగ వాతావరణం నెలకొనగా, ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని బీజేపీ పక్షాన పట్టుబట్టారు. అలాగే 22-ఏ భూముల వివాదంపై మంత్రి పొంగులేటిని నిలదీశారు.