ఏపీలో టెక్నాలజీ కేంద్రాల ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలో గ్లోబల్ పేమెంట్స్ సంస్థ మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో జీసీసీ, టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఫిన్‌టెక్ సలహాదారునిగా చేరాలని కోరారు. పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరగా, సంస్థ ప్రతిపాదనలపై చర్చిస్తామని లాహిరి స్పష్టం చేశారు.