టెక్కలిలో వైకాపాను వీడి ఐదు వందల మంది తెలుగుదేశంలో చేరిక

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

టెక్కలి మండలంలోని సీతాపురం, తిర్లంగి పంచాయతీల పరిధిలో వైకాపాకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.