అమెరికాలో హెచ్ వన్ బీ వీసా లక్ష డాలర్ల ఫీజు మరో ఏడాది పొడిగింపు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమెరికా

అమెరికాలో హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల భారీ ఫీజును మరో ఏడాదిపాటు పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ఆయన సంతకాలు చేశారు. విదేశీ ఉద్యోగుల నియామకాన్ని నిరుత్సాహపరచడం, అమెరికన్ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఈ లక్ష డాలర్ల రుసుముపై న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ, దీనిని పొడిగించడం గమనార్హం.